NTV Telugu Site icon

Nadendla Manohar: లీడర్లు అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. స్పందించే మనసు ఉండాలి..

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: లీడర్ అంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లాగా స్పందించే మనసు ఉండాలి అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌.. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారు.. కానీ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోక పోగా.. ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు. గత ఐదేళ్లుల్లో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తుగా పేర్కొన్నారు. వారి నిర్లక్ష్యం, వారి పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేక పోతున్నాడు.. ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్ కు ఉందా? జగన్, కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలుకు ఏ విధంగా సేవలు అందించారో చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

Read Also: Majnu Missing: తప్పిపోయిన వరుడు.. కానీ నిజం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.. వైరల్

ఇక, పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞాని లాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారు అని ఎద్దేవా చేశారు మనోహర్‌.. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కల్యాణ్‌ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదన్నారు.. పిఠాపురంలో మీ జగనన్న కాలనీ ఎందుకు పరిశీలించలేదు? అని నిలదీశారు. ఏలేరు గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు.. గత ఐదేళ్లు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. వర్షాలు ఎక్కువుగా పడినందువల్ల చేయలేదని చెప్పడానికి సిగ్గుండాలి.. జగన్ ఏనాడైనా జేబులో నుంచి లక్ష రూపాయలకు సామాన్యునికి సాయం చేశారు? సీఎం హోదాలో ఉండి.. ప్రజలకు కనిపించకుండా పరదాలు కప్పుకుని తిరిగారు అని మండిపడ్డారు.. అన్నమయ్య ప్రాజెక్టు మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా..? దీనికి గురించి జగన్ కు మాట్లాడే అర్హత ఉందా? అని ఫైర్‌ అయ్యారు.. పులివెందుల ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న జగన్.. మీ పార్టీ శ్రేణులను వరద సహాయక చర్యలు ఎందుకు చేయించలేదని మండిపడ్డారు.

Read Also: Tamil Nadu CM: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్..

లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లాగా స్పందించే మనసు ఉండాలి.. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షో మెన్ తప్ప.. జగన్ లీడర్ అనిపించుకోలేడు అని సూచించారు మనోహర్‌.. ప్రజలకు కష్టం వస్తే నిలబడాల్సిన బాధ్యత మీకు, మీ నాయకులపై లేదా? 74 ఏళ్ల వయసులో చంద్రబాబు ప్రతిరోజూ నాలుగు సార్లు వరదల్లో తిరిగారు.. మీరు ఎప్పుడైనా నిజాయతీగా ప్రజల కోసం పని చేశారా? అని ప్రశ్‌నించారు. పేదలకు అందాల్సిన బియ్యం ఎగుమతి చేసే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.