Minister Nadendla Manohar: ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది.. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై జరిగిన ఈ మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ముఖ్యంగా, మార్కెట్ ధరలపై నిత్యం పర్యవేక్షణ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు, మిల్లెట్ల ప్రోత్సాహం దిశగా చర్యలపై చర్చించారు.. ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించిన మంత్రులు, అధికారులు..
Read Also: Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం రేటు 4.34 శాతం కాగా, జాతీయ సగటు 5.22 శాతం కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.. 154 మండల కేంద్రాల్లోని సీపీ యాప్ ద్వారా ప్రతీరోజూ ధరల సేకరణ, విశ్లేషణ చేస్తోంది ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో 69 నిత్యవసర సరుకులు ధరలను పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు వీటిలో ధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, మసాలాలు ఉండనున్నాయి.. గత ఏడాదితో పోల్చితే కందిపప్పు (13%), గ్రౌండ్‌నట్ ఆయిల్ (4%), మిర్చి (27%) ధరలు తగ్గినట్టు తెలిపారు.. అయితే, AP మిషన్ మిల్లెట్ వంటి పథకాల ద్వారా జొన్నలు, రాగిలను ప్రోత్సహించేందుకు మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది.. మిడ్-డే మీల్స్, సంక్షేమ పథకాలలో మిల్లెట్లు చేర్చడం.. అదే విధంగా మిల్లెట్ వాడకాన్ని ప్రోత్సహించడంపై చర్చ సాగింది.. రైతులకు ధరల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అధికంగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడానికి కారణం కావడంతో… ధరల అదుపుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది మంత్రుల కమిటీ..