కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.4500 కోట్లను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 114,000 ఇళ్ళు పూర్తి చేసిందని.. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం నుంచి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆ ఇళ్ళ తాళాలను ఇవ్వడం జరుగుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. భవిష్యత్తులో పీఎంఏవై (PMAY 1.0) కింద మరో 6 లక్షల ఇళ్ళు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు.
Read Also: ICC T20: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024 కెప్టెన్‌గా ‘హిట్ మ్యాన్’..
2025 డిసెంబరు నాటికి అన్ని ఇళ్ళు పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.. NREGS కింద 7 కోట్ల పనిదినాలు అయితే 2100 కోట్లు ఆదాయం వస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 9% రాష్ట్ర జీఎస్టీ రూపంలో NREGS కింద రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తుంది.. స్టేట్ కమిటీలో హౌసింగ్, మునిసిపల్ మంత్రులు కన్వీనర్లుగా ఈ కార్యక్రమాలకు కమిటీ వేశామని అన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.900 కోట్లలో రూ.40 కోట్లు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ఈ ప్రభుత్వం ఇవ్వనుందని మంత్రి పార్థసారథి చెప్పారు.
Read Also: Pushpa 2 : తెలుగు స్టేట్స్ సింగిల్ స్క్రీన్ లో పుష్ప రాజ్ హిస్టరీ
మరోవైపు.. విజయసాయి రెడ్డి రాజీనామాపై మంత్రి పార్థసారథి స్పందించారు. విజయసాయి చేసిన తప్పులు ఆయనను వెన్నంటి ఉంటాయన్నారు. ఇంకా చాలామంది వైసీపీలో నుంచి వెళతారని తెలుస్తోందని పేర్కొన్నారు. కూటమి పార్టీలు ఎలాంటి కుట్ర రాజకీయాలు చేయవు.. విజయసాయి డ్రామాలు చేస్తున్నారా అనేది తెలీదని అన్నారు. వ్యవసాయదారుడుగా విజసాయి ఎప్పుడూ గుర్తింపు పొందలేదని విమర్శించారు. విజయసాయితో కంటే ప్రజలకే తాను దగ్గరగా ఉండేవాడిని మంత్రి పార్థసారథి తెలిపారు.