Minister Kolusu Parthasarathy: కొత్త ఛాంబర్‌లోకి మంత్రి కొలుసు పార్థసారథి
- కొత్త ఛాంబర్‌లోకి మారిన మంత్రి కొలుసు పార్థసారథి..
- సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతల స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: మంత్రి కొలుసు పార్థసారథి కొత్త ఛాంబర్‌లోకి మారారు.. సచివాలయంలోని బ్లాక్ 4లో ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి పార్థసారథి.. ఇప్పటి వరకు తన ఛాంబర్ పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఛాంబర్‌లోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు మంత్రి కొలుసు.. ఇక, పనులు పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త ఛాంబర్‌లోకి మారారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు.. ఉద్యోగులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు..
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ఇక, సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పరిపాలనలో చేసిన తప్పులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతున్నారని తెలిపారు.. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. ఎన్నికల హామీలను అమలు చేయడానికి చిత్తశుద్దితో పని చేస్తున్నాం అన్నారు.. గత ప్రభుత్వం అవినీతిలో విప్లవం సృష్టించింది అంటూ ఎద్దేవా చేశారు.. అత్తారింటికి దారేదీ తరహాలో రాష్ట్రంలోని సంపద అంతా తన ఇంటికి వచ్చేలా గత పాలకులు ప్రణాళికలు రచించుకున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు.. గత ప్రభుత్వం రూ.4,500 కోట్ల మేర గృహ నిర్మాణ రంగం నిధులను దారి మళ్లించి పేదలకు అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు మంత్రి కొలుసు పార్థసారథి.. మరోవైపు.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పార్థసారథి.. ప్రజలు, రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో.. గత ప్రభుత్వం హయాంలో ఎగవేసిన డబ్బులను సైతం మా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
తాజావార్తలు
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!