Site icon NTV Telugu

AP Tourism Policy 2024-2029: ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029 ఆవిష్కరణ.. టార్గెట్‌అదే..!

Minister Kandula Durgesh

Minister Kandula Durgesh

AP Tourism Policy 2024-2029: ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను ఆవిష్కరించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో.. ఈ కొత్త పాలసీని విడుదల చేశారు.. ఇక, నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో చర్చించి ఆహ్వానించారు మంత్రి దుర్గేష్.. అంతేకాదు.. పెట్టుబడిదారుల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు మంత్రి దుర్గేష్.. పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.. అంతేకాకుండా.. పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ విధివిధానాలను తెలిపారు మంత్రి దుర్గేష్.. పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు.

Read Also: Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. ఈరోజు బంగ్లాదేశ్.. రోజుకో బ్యాగ్‌తో ప్రియాంక హల్‌చల్

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వివరించారు మంత్రి కందుల దుర్గేష్.. పర్యాటక రంగంలో తమది సమగ్ర విధానం అని తెలిపారు.. నూతన పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు.. అయితే, పర్యాటక రంగంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో విశాలమైన సముద్రతీరం, అద్భుతమైన చారిత్రక, వారసత్వ, ప్రకృతి సంపద, సజీవ నదులు ఉన్నాయని వివరించారు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.

Exit mobile version