NTV Telugu Site icon

Minister Gummadi Sandhya Rani: అంగన్వాడీల ప్రతి సమస్యపై సానుకూలంగా ఉన్నాం.. ఆందోళన వద్దు

Minister Gummadi Sandhya Ra

Minister Gummadi Sandhya Ra

Minister Gummadi Sandhya Rani: అంగన్వాడీల ప్రతి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఆందోళనకు వెళ్లొ్దని సూచించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. నవంబర్‌ 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి.. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది.. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం.. సమ్మెలు, ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవు అంటూ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు..

Read Also: Mokshagna : గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా షూటింగే లేటు

అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు మంత్రి సంధ్యారాణి.. అంగన్వాడీ సిబ్బంది సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవలలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలన్నారు.. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.. 5,31,446 గర్భవతి బాలింత తల్లులు, 13,03,384 మంది 3 సంవత్సరాల లోపు పిల్లలు, 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఆరోగ్య, పోషకాహార సేవలను అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లు.. తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడారు.. ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించాం అన్నారు.. అయితే, ఎలాంటి ఆందోళనలు నిర్వహించొద్దు.. దశలవారీగా మీ సమస్యలను పరిష్కరిస్తామి తన ప్రకటనలో పేర్కొన్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి..