Site icon NTV Telugu

Minister Gottipati Ravi Kumar: జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. న్యాయస్థానం ఇచ్చేది కాదు..!

Gottipati

Gottipati

Minister Gottipati Ravi Kumar: జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే.. కానీ, న్యాయస్థానం ఇచ్చేది కాదు అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి బయటకు వచ్చి నేటికి 12 సంవత్సరాలు అయినందుకు వైఎస్‌ జగన్ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటాడేమో? అని సెటైర్లు వేశారు.. జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈపాటికి సకల సౌకర్యాలు ఏర్పడేవన్నారు.. ప్రపంచంలో ఏ రైతులు చెయ్యలేని త్యాగం అమరావతి రైతులు చేశారు. 33 వేల ఎకరాలు భూములు రాజధానికి ఇచ్చారు.. రైతుల చేసిన భూ త్యాగం మరువలేం, వారికిచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని ప్రకటించారు..

Read Also: Arjun Das : హస్కీ వాయిస్‌తో విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్‌ ఎంట్రీ

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో సీఆర్‌డీఏ బిల్డింగ్ నిర్మాణం పనులను పరిశీలించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. దసరా సందర్భంగా భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఏర్పాట్లను పరిశీలించారు.. విద్యుత్ సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.. భవనానికి విద్యుత్ పనులు రేపటిలోగా అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. పరిపాలనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.. ఈ సందర్భంగా అమరావతి రాజధానితో పాటు.. వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version