Site icon NTV Telugu

Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులపై సర్కార్‌ కీలక నిర్ణయం..

Dola Bala Veeranjaneya Swam

Dola Bala Veeranjaneya Swam

Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు, PMJAY వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కి చర్యలు చేపట్టాలన్నారు మంత్రి డోలా.

Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు

ఇక, స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి డోలా.. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని.. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.. ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయి. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ PMJAY వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Exit mobile version