Site icon NTV Telugu

AP Ministers: వరద తగ్గేవరకు పునరావాస కేంద్రాలు.. ప్రతీ కుటుంబానికి రూ.3 వేలు..

Ap Ministers

Ap Ministers

AP Ministers: వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి.. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3 వేల రూపాయలు అందిస్తాం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో నిర్వసితులతో ముఖా ముఖి నిర్వహించారు మంత్రులు.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయంలో వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గాల్లోనే పరామర్శలు, సమీక్షలు నిర్వహించేవాళ్లు.. ప్రతిపక్షాలు వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.. అయితే, వరద బాధితులను ఆదుకునేందుకు NDA ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Read Also: Jagadish Reddy: విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్

ఇక, వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. నలుగురు మంత్రులు ముంపు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారన్న ఆయన.. ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలని స్పష్టంగా చెప్పారన్నారు.. వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంటుందన్నారు.. వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి.. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.3 వేలు అందిస్తాం అని ప్రకటించారు. వరద బాధితులకు ఎదురవుతున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.

Exit mobile version