NTV Telugu Site icon

Minister Anagani: జగన్కి కావాల్సింది ప్రతిపక్ష హోదానే.. ప్రజా సమస్యలు కాదు..

Angani

Angani

Minister Anagani: జగన్ రెడ్డికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే ప్రజా సమస్యలు కాదు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసన సభా సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి సభకు వచ్చారు.. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యల్నీ సమర్ధవంతంగా లేవనెత్తారు అని పేర్కొన్నారు. ఇక, లోక్ సభలో వాజ్ పేయికి ప్రతిపక్ష నేత హోదా లేకున్నా దేశ సమస్యలను అర్థవంతంగా సభ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ రాహుల్ గాంధీ సభకు హాజరై ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటారు అని మంత్రి అనగాని మండిపడ్డారు.

Read Also: Gyanesh Kumar: కుంభమేళలో పాల్గొన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్.. కుటుంబ సభ్యులతో కలిసి స్నానం

కానీ, జగన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ వితండవాదం చేస్తున్నారు అని మంత్రి సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఇక, ప్రజలు ఇవ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనం అని ఎద్దేశా చేశారు. జగన్ రెడ్డికి ప్రజా సమస్యలపై చిత్త శుద్ది ఉన్నా.. చట్టాలపై గౌరవం ఉన్నా శాసన సభా సమావేశాలకు హాజరయ్యే వారు అని చెప్పుకొచ్చారు.