Site icon NTV Telugu

Marri Rajasekhar: వైసీపీకి షాక్..! టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌..

Marri Rajasekhar

Marri Rajasekhar

Marri Rajasekhar: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్‌.. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మర్రి రాజశేఖర్.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే వైస్సార్సీపీలో సుదీర్ఘ కాలంగా పని చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.. వైస్సార్సీపీలో సరైన గుర్తింపు రాలేదంటూ.. వైస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్ పని తీరు నచ్చక పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించారు.. గత కొన్ని నెలలు క్రితం వైస్సార్సీపీకి, శాసనమండలి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు..

Read Also: Trump: మోడీ మంచి స్నేహితుడే కానీ..! బ్రిటన్ టూర్‌లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కాగా, వైసీపీకి రాజీనామా చేస్తున్నా. మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరబోతున్నా అంటూ మార్చిలోనే ప్రకటించారు మర్రి రాజశేఖర్‌.. వైసీపీని వీడి నేను బయటకు రావడానికి పార్టీ అధినేత జగనే కారణం.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి జగన్‌ హయాంలో కనిపించలేదు. ఎంతో ఓర్పుగా ఉన్నప్పటికీ జగన్‌ విధానాలు, నిర్ణయాలు నచ్చక బయటకు రాక తప్ప లేదని వెల్లడించారు.. 40 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది.. పార్టీని బలోపేతం చేసి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినప్పటికీ నాకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. అంతేకాదు, నాకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తానని 2019లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో జగన్‌ ప్రకటించారు. 2024 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని నాకు తెలియకుండానే చేశారు. అంతా అయ్యాక నన్ను పిలిపించి పార్టీని గెలిపించమని కోరారు.. ఇలా ఆ పార్టీలో గౌరవం లేనప్పుడు ఎందుకు ఉండాలని రాజీనామా చేశాను.. నేను ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగానే రాజీనామా చేశాను. కార్యకర్తలందరితో మాట్లాడి, మంచి రోజు చూసి టీడీపీలో చేరతాను అని మర్రి రాజశేఖర్‌ గతంలో వెల్లడించిన విషయం విదితమే..

Exit mobile version