AP Liquor Policy: ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రారంభం.. వారిలో ఉత్కంఠ..!
- మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం ప్రారంభమైన లాటరీ ప్రక్రియ..
- దరఖాస్తుదారుల్లో నెలకొన్న ఉత్కంఠ..
- కలెక్టర్లు.. ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ..
- రాష్ట్ర వ్యాప్తంగా 89
- 882 దరఖాస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ ద్వారా కేటాయిస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 17 వందల 97 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్ వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు ఎక్సైజ్‌శాఖ అధికారులు. సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తున్నారు. ఈ ప్రక్రియంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు.
Read Also: TGPSC Group-1 2024: అలర్ట్.. నేటి నుంచి వెబ్సైట్ లో గ్రూప్-1 హాల్‌టికెట్లు..
Also Read
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
మరోవైపు లిక్కర్ షాప్స్ లైసెన్సుల కోసం లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని.. దీని ద్వారా 2 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారుల అంచనా వేశారు. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి రెండు, మూడేసి దరఖాస్తులే వచ్చాయి. రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి దాదాపు 52 దరఖాస్తులు వచ్చాయి.
తాజావార్తలు
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!