NTV Telugu Site icon

AP Liquor Shops Tenders: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. ఎక్సైజ్‌ శాఖ కీలక సూచనలు

Ap Liquor Policy

Ap Liquor Policy

AP Liquor Shops Tenders: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపులను మూసివేస్తూ.. కొత్త పాలసీ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 3396 ప్రైవేట్‌ మద్యం షాపులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.. అందులో భాగంగా మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. వరుస సెలవుల నేపథ్యంలో.. మధ్యలో ఓసారి గడువు పొడిగించారు.. అయితే, ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది..

Read Also: IND vs BAN: హైదరాబాద్ టీ20లో భారీ మార్పులు.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్!

ఇక, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చాయి.. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపుల కోసం 48,39 దరఖాస్తుల దాఖలు కాగా.. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 40 మద్యం దుకాణాలకు కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.. ఇవాళ రాత్రి వరకు గడువు ఉండడం వల్ల మరిన్ని దరఖాస్తులు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. ఈ నేపథ్యంలో.. కీలక సూచలను చేశారు ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్‌
నిషాంత్ కుమార్.. మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుది గడువు అని స్పష్టం చేసిన ఆయన.. సాయంత్రం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందన్నారు.. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపు చేసుకోవచ్చు అన్నారు.. ఇక, బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్ లో ఉంటేనే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.. సంబంధిత పత్రాలతో సాయంత్రం 7 గంటల్లోపు SHOల్లో అందుబాటులో ఉన్నవారికి టోకెన్లు అందించి క్రమ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేస్తాం న్నారు.. దరఖాస్తు దారులు నిబంధనలు పాటించి సజావుగా కార్యక్రమం ముగిసేలా సహకరించాలని కోరారు ఏపీ ఎక్సైజ్‌ వాఖ కమిషనర్‌ నిషాంత్ కుమార్..