Site icon NTV Telugu

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ముంబైకి సిట్‌ టీమ్‌..

Sit

Sit

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్‌ టీమ్‌ ముంబై వెళ్లింది.. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌).. లిక్కర్ స్కాంలో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయటం కోసం ముంబై వెళ్లింది సిట్ టీమ్.. ఇక, లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్‌.. ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి.. నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్‌ అధికారులు..

Read Also: Health Tips: యంగ్ గా, అందంగా కనిపించాలనుకుంటున్నారా?.. జస్ట్ ఈ పండ్లను డైట్ లో చేర్చుకోండి

మరోవైపు, లిక్కర్ స్కాం కేసు కీలక నిందితుడు కేసిరెడ్డి అంచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది.. లిక్కర్ స్కాం నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో భారీ డంప్‌ను గుర్తించారు.. ఇప్పటికే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్.. ఇంకా ఎక్కడెక్కడ నగదు డంప్ లు ఉన్నాయి..? అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది.. ఆ కోణంలో వరుణ్ ను విచారిస్తున్నారు.. వరుణ్ నుండి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు..

Exit mobile version