NTV Telugu Site icon

Janavani: జనసేన కార్యాలయంలో జనవాణి.. భూకబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ

Janavani

Janavani

Janavani: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి జనవాణి కార్యక్రమం నిర్వహించారు.. భూ కబ్జాలు, ఆక్రమణలపై జనవాణికి ఫిర్యాదులు వెల్లువలా వచ్చినట్టు జనసేన ప్రకటించింది.. అయితే, వైసీపీ నేతల దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టు చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి భూబాధితులు క్యూ కడుతున్నారని జనసేన తెలిపింది.. ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తోంది.. భూ ఆక్రమణలు, రికార్డుల తారుమారుపై కూడా ఫిర్యాదు అందాయి.. భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నట్టు వెల్లడించారు..

Read Also: Railway Budget For AP: రైల్వే బడ్జెట్‌.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు..

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని వెనామపాలెంలో తమకు వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమిలో దూడల వెంకయ్య అనే వ్యక్తి వైసీపీ నేతల అండతో రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారని.. మా భూమిని ప్లాట్లుగా మార్చేసి దొంగ డాక్యుమెంట్లతో 60 మందికి విక్రయించారని చంద్రకళ అనే మహిళ ఫిర్యాదు చేసింది.. ఇక, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన సామెల్‌ తన తండ్రికి బ్రిటీష్‌ వారు ఇనాంగా ఇచ్చిన 12 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో హస్సేన్‌ రెడ్డి, టంగుటూరు రామిరెడ్డితో పాటు మరో నలుగురు కలిసి ఆక్రమించారంటూ జనవాణిని ఆశ్రయించారు.. ఇలా భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జనవాణికి వచ్చాయి..