Site icon NTV Telugu

Andhra Pradesh: మరో పథకం పేరు మార్చిన కూటమి సర్కార్‌.. ఉత్తర్వులు జారీ

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు స్కీమ్‌ల పేర్లను మారుస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో స్కీమ్‌లకు పెట్టిన పేర్లను తొలగించి.. కొత్త పేర్లు పెడుతోంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. అయితే.. ఈ కాలనీల పేర్లను మారుస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరను PMAY-NTR నగర్‌గా మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Read Also: Rashmika Mandanna : గాయం నుండి కోలుకుంటున్న రష్మిక

సాధారణంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు అనుగుణంగా పార్టీలు స్కీమ్‌లను పెట్టి వాటి అమలు సమయంలో పేర్లను పెడుతుంటాయి. ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం కొన్ని స్కీమ్‌లకు జగన్ పేరు వచ్చేలా పెట్టింది. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాల పేర్లు మారుస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా పేరు మార్చింది. జగననన్న సీవిల్ సర్వీసెస్ ప్రోగ్రాంకు జగన్ పేరు తొలగించింది. జగన్ విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్చింది. జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. జగనన్న ఆణిముత్యాలు స్కీమ్‌కు అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారంగా నామకరణం చేసింది. అలాగే అమ్మ ఒడి తల్లికి వందనం అయింది. తాజాగా జగనన్న కాలనీలు PMRY-NTR నగర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Exit mobile version