MP Vallabhaneni Balasouri: జనసేన ఎంపీకీ లోక్‌సభలో కీలక పోస్టు దక్కింది.. లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. అయితే, బాలశౌరికి ఈ పోస్టు కొత్త కాదు.. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఆయన పనిచేశారు.. చైర్మన్ తో పాటు 15 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఈ కమిటీలో కార్తీ చిదంబరం, మాజీ మంత్రి ఏ.రాజా, బెంగాల్ నుంచి మొహిత్రి మొవ్వా, ఎన్‌కే ప్రేమచంద్, తెలంగాణ నుంచి బీజేపీ తరఫున రఘునందన రావు తదితరులు ఉన్నారు..
Read Also: Akashteer: పాక్ గుండెల్లో ‘ఆకాష్‌టీర్’ దడ.. నిపుణుల్లో కూడా కలవరం.. అంత ప్రత్యేకత ఏంటి?
మరోవైపు.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో లోకసభలో జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా ఉన్నారు ఎంపీ బాలశౌరి. ఇప్పుడు ఆయనకు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మరోసారి బాధ్యతలు అప్పగించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇక, లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మరోసారి తనకు అవకాశం కల్పించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ బాలశౌరి.. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు..
Appointed as Chairman, Committee on Subordinate Legislation, Lok Sabha for the 5th consecutive year…honoured and grateful to our leader @PawanKalyan Sri Pawan Kalyan garu, HCM @ncbn Sri Nara Chandra Babu Naidu garu, Lok Sabha Speaker @ombirlakota Sri Om Birla ji for their… pic.twitter.com/vhfEq6AKh9
— Vallabhaneni Balashowry (@VBalashowry) May 14, 2025
