Janasena Udyami Membership: ఎన్నారైల కోసం జనసేన ప్రత్యేక సభ్యత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Udyami Membership: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది.. మరింత టార్గెట్ పెట్టుకుని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం రద్దు చేసింది అధిష్టానం.. ఇక, జనసేన పార్టీ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ‘ఎన్ఆర్ఐ ఉద్యమీ మెంబర్షిప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను పార్టీలోకి ఆహ్వానిస్తూ జనసేన నాయకత్వం పిలుపునిచ్చింది. పార్టీ బలోపేతానికి ఎన్నారైల భాగస్వామ్యం కీలకమని భావిస్తున్న నాయకత్వం, వారి సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది.
ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ప్రత్యేక సభ్యత్వం ప్రారంభించబడినట్లు నాయకులు పేర్కొన్నారు. విదేశాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా జనసేన నాయకత్వం వెల్లడించింది. ఈ చర్యతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల మద్దతు మరింతగా పెరుగుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
JanaSena Udyami Membership
JanaSena Party invites NRIs across the world to join the movement and support the vision of Sri @pawankalyan through Udyami Membership.
Register here:👇https://t.co/EngWphe768#JanasenaUdyami pic.twitter.com/tviajl6mj3
— JanaSena Party (@JanaSenaParty) March 9, 2026
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!