NTV Telugu Site icon

Shock to YSRCP: జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్..

Tdp

Tdp

Shock to YSRCP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా.. వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నారు.. ఇక, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు.. టీడీపీ కండువా కప్పుకోవడంతో.. పలు మున్సిపాల్టీలను సైతం తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. తాజాగా.. జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది.. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు సైకిల్‌ పార్టీలో చేరారు.. వారికి కండువాకప్పి టీడీపీలోకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్.

Read Also: Darshan: జైల్లో ఉన్నా కొవ్వు కరగలేదే.. మీడియాకు మధ్య వేలు చూపించిన దర్శన్?

వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు.. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు.. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ పడనివిధంగా భారీ వర్షాలు కురిసాయి. ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచిందన్నారు.. అయితే, వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు మంత్రి నారా లోకేష్‌..