NTV Telugu Site icon

YS Jagan Districts Tour: జగన్‌ జిల్లాల పర్యటన మరింత ఆలస్యం..! అసలు టార్గెట్‌ అదేనా..?

Ys Jagan

Ys Jagan

YS Jagan Districts Tour: సంక్రాంతి పండుగ తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని సమాచారాన్ని ఇచ్చారు.. కానీ, జగన్‌ జిల్లాల పర్యటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చేలా ఉంది.. జిల్లాల టూర్ పై ఆయన ఇంకా ఓ స్పష్టతకు రాకపోవటమే అందుకు కారణంగా కనిపిస్తోంది.. మరి కొన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు పెండింగ్ లో ఉండటంతో అవి పూర్తయిన తర్వాత ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.. దీనికి తోడు ప్రభుత్వానికి మరికొన్ని రోజులు టైం ఇస్తే మరికొన్ని వైఫల్యాలు బయటపడతాయి.. పనిలో పనిగా ప్రభుత్వాన్ని మరింత ఎండగట్టవచ్చని ఆయన భావిస్తుండవచ్చన్న రాజకీయ విశ్లేషకులు లెక్కలు కూడా వేస్తున్నారు.

Read Also: WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..

ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకాపోవటంపై ప్రతీ ఇంట్లో ఇదే విషయం మీద చర్చ సాగుతోందని జగన్.. పార్టీ నేతలతో ఇటీవల పలుసార్లు చెప్పుకొచ్చారు.. ఐదేళ్ల పాటు వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను టీడీపీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అమలు చేయని తీరుని జనాలు సరిపోల్చుకుని కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. అందువల్ల జనంలోకి వెళ్ళేందుకు ఇదే సరైన భావించారు.. సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తానని ప్రకటించారాయన.. ప్రతీ బుధ, గురువారాలలో రెండు రోజుల పాటు జిల్లాలలోనే ఉంటానని అక్కడే బస చేస్తానన్నారు జగన్.. కార్యకర్తలతో మమేకం అవుతానని తనకు అన్ని విషయాలు వారు నేరుగా కలసి చెప్పుకోవచ్చన్నారు.. పార్లమెంట్ యూనిట్ గా చేసుకుని ఈ జిల్లాల పర్యటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. ఇక డేట్.. జిల్లా.. ముహూర్తం అన్నీ తొందరలోనే ఖరారు చేస్తారని భావించారు ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమం నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం..

Read Also: Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు.. ట్రై చేయండి..!

అయితే, తాజాగా వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలు ఆ పర్యటన మరికొంత కాలం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.. ఇప్పటికే ఆయన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రాయలసీమలో మూడు, ఉత్తరాంధ్రలో ఓ రెండు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు.. ఈ నేపథ్యంలోనే మిగతా పెండింగ్ లో ఉన్న జిల్లాల సమీక్షలు పూర్తి చేసిన అనంతరం జిల్లాల పర్యటనలకు వెళ్తే బాగుంటుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.. ఈలోగా ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చినట్లుగా అవుతుంది.. అప్పుడు మరికొన్ని ప్రభుత్వ వైఫల్యాలపై మరింత ఎండగట్ట వచ్చని భావిస్తున్నట్లు సమాచారం.. అందుకే మరికొంత కాలం వేచి చూద్దామనే ధోరణిలోనే తాజాగా మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారట.. మరి జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు మొదలవుతుందనేది చూడాలి..