Minister Nara Lokesh and BJP MLAs: మంత్రి నారా లోకేష్.. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ.. వారిచూపు బీజేపీ వైపు..!
- అసెంబ్లీలో మంత్రి లోకేష్‌తో మంత్రి సత్యకుమార్.. బీజేపీ ఎమ్మెల్యేల భేటీ..
- చాలామంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ప్రస్తావన..
- పార్టీలో చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదన్న బీజేపీ..
- పార్టీలో చేరికలు ఏవైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందామని లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh and BJP MLAs: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. ఇక, అసెంబ్లీలోని మంత్రి నారా లోకేష్ చాంబర్‌ను ఆయనతో సమావేశం అయ్యారు మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ.. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట.. అయితే, పార్టీలో చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు తెలిపారట.. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని.. లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట బీజేపీ నేతలు.. పార్టీలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదని బీజేపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని లోకేష్ ముందు పెట్టారట..
Read Also: TG Govt: 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 9 శాఖలపై చర్చ
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇక, ఈ ప్రతిపాదన మంచిదని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.. తోట త్రిమూర్తులు చేరికపై వస్తున్న ఊహగానాలను ప్రస్తావించారట అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి. బీజేపీలో చేర్చుకుంటున్నారా? అని మంత్రి సత్యకుమార్ ను ప్రశ్నించారు నల్లమిల్లి… అయితే, తనకు తెలిసి అటువంటిదేదీ లేదని సత్య కుమార్ బదులిచ్చారట.. మొత్తంగా మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ (బీజేపీ), బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో.. పార్టీలో చేరికలపై కీలక చర్చ జరిగిందని.. బీజేపీ నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?