Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Imd Predicts That It Will Become A Low Pressure Over Central Bay Of Bengal By 23rd

Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..!

Published Date :September 20, 2024 , 10:13 am
By Sudhakar Ravula
  • తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి..
  • 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం..
  • ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఉండగా.. 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.. అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల తీరానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. అయితే, ఇది రుతుపవనాలు ముగింపు సీజన్‌లో ఆఖరి అల్పపీడనంగా అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో.. ఇవాళ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది.. ఈ సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించారు అధికారులు..

Read Also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

ఇక, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉండగా.. 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది.. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.. ఈ క్రమంలో 23వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంచనా వేసింది అమరావతి వాతావరణ కేంద్రం.. అయితే.. ఇప్పటికే రాష్ట్రాన్ని భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. బుడమేరు సృష్టించిన బీభత్సంతో విజయవాడ అతలాకుతలం అయిన విషయం విదితమే.. కాగా, మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు టెన్షన్‌ పెడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap weather update
  • central Bay of Bengal
  • IMD Predicts
  • Low pressure

తాజావార్తలు

  • Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

  • US-Iran War: ఇరాన్‌లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక

  • Fuel Crisis: దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్.. కేంద్రం కీలక ప్రకటన..

  • MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సేవ‌లు..

  • Prabhas-PVCU: ‘బ్రహ్మరాక్షస్’ కోసం ఊహించని క్యామియో?

ట్రెండింగ్‌

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions