NTV Telugu Site icon

Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..!

Heavy Rains

Heavy Rains

Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఉండగా.. 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.. అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల తీరానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. అయితే, ఇది రుతుపవనాలు ముగింపు సీజన్‌లో ఆఖరి అల్పపీడనంగా అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో.. ఇవాళ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది.. ఈ సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించారు అధికారులు..

Read Also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

ఇక, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉండగా.. 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది.. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.. ఈ క్రమంలో 23వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంచనా వేసింది అమరావతి వాతావరణ కేంద్రం.. అయితే.. ఇప్పటికే రాష్ట్రాన్ని భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. బుడమేరు సృష్టించిన బీభత్సంతో విజయవాడ అతలాకుతలం అయిన విషయం విదితమే.. కాగా, మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు టెన్షన్‌ పెడుతున్నాయి.

Show comments