CM Chandrababu Serious warning: బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్లన్లు అందజేశారు.. ఇక, ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కూటమిని గెలిపించారని ధన్యవాదాలు తెలిపారు.. ఇక, అనంతపురం జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉంది అని గుర్తుచేసుకున్నారు.. పక్క రాష్ట్రాల్లో పెన్షన్‌లు చాలా తక్కువుగా ఇస్తున్నారు.. మన పక్క గ్రామం కర్ణాటకలో వుంది అక్కడ కేవలం 1200 రూపాయిలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని వెల్లడించారు..
Read Also: Kia Syros: కియా “సిరోస్” వచ్చేస్తోంది.. సెల్టోస్, సోనెట్ తర్వాత మూడో ఎస్‌యూవీ..
ఇక, గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎన్ని పాపాలు చేయాలో అన్ని చేశారు.. ఎక్కడికక్కడ అప్పులు చేశారని మండిపడ్డారు.. చివరకు తహసీల్దార్ కార్యాలయలు తాకట్టు పెట్టే పరిస్థితికి గత ప్రభుత్వం తయారయ్యిందని ఫైర్ అయ్యారు.. ఒకప్పుడు నాసిరకం మద్యం దొరికేది.. ఇప్పుడు ఇక్కడే మంచి మద్యం దొరుకుతుందన్నారు.. అయితే, బెల్ట్ షాపులు పెడుతున్నారని ప్రచారంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బెల్ట్ షాపులు పెడితే… బెల్ట్ తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మద్యం దుకాణాల విషయలో నాయకులు, దందాలు చేసే వారు దూరితే వారిని వదలను అంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..