IAS, IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొదటగా పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలపై దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేయనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Liquor Prices: మందు బాబులకు బిగ్ షాక్.. మరోసారి మద్యం ధరలు పెంపు?
అయితే, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయ్యేలోపు రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పలు జిల్లాల కలెక్టర్ల బదిలీకి సర్వం సిద్ధం అయింది.. గుంటూరు జిల్లా కలెక్టర్ గా చెరుకూరి శ్రీధర్ ని నియమించే అవకాశం ఉంది. అలాగే, 2016 బ్యాచ్ ఐఏఎస్ లలో కలెక్టర్ పోస్టింగ్ దక్కని వారికి ఈసారి అవకాశం లభించనుంది. ఇక, 2017 బ్యాచ్ ఐఏఎస్ లను కలెక్టర్లుగా నియమించే అవకాశం కూడా ఉంది.
