Site icon NTV Telugu

Supreme Court: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ పిటిషన్‌ కొట్టివేత..

Cm Chandrababu

Cm Chandrababu

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. అయితే, స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయగా.. జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఛార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ధర్మాసనం.

Read Also: Side Effects of Smoking: సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారా? దాని సైజ్ తగ్గుతుందట!

అంతేకాదు.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అయి.. 50 రోజులకు పైగా జైలులో ఉన్న విషయం విదితమే కాగా.. మొదట ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసిన మూడో వ్యక్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. మీకేం సంబంధం.. పిల్‌ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి..? అంటూ నిలదీసింది సుప్రీంకోర్టు..

Exit mobile version