Home Minister Vangalapudi Anitha: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని తన్నాలని అనలేదు అని క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సినిమా వేరు రాజకీయం వేరన్న ఆమె.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవన్ కల్యాణ్ అభిమానులు లేరా..? పవన్ కల్యాణ్ సినిమా చూడరా? అని ప్రశ్నించారు.. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్ కామెంట్లు చేశారు.. నెల్లూరులో జగన్ చేసిన సీరియన్ వార్నింగ్ కామెంట్లపై స్పందిస్తూ.. అది వార్నింగ్ కాదు.. సినిమా డైలాగ్ అని వ్యాఖ్యానించారు.
Read Also: Banjara Hills: పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. యువకుడి కిడ్నాప్
వైఎస్ జగన్.. నెల్లూరు పర్యటనపై హోం మంత్రి అనిత విమర్శలు గుప్పించారు.. వైఎస్ జగన్ ప్రాంతానికి ఒక మాట మాట్లాడే వ్యక్తి అని దుయ్యబట్టారు.. అసలు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లటం ద్వారా వైఎస్ జగన్ ఏ మెసేజ్ ఇస్తున్నారు..? అని మండిపడ్డారు.. ఓ మహిళా ఎమ్మెల్యేను కించ పరిచిన వ్యక్తిని పరామర్శించడం సరికాదు అని హితవు పలికారు.. వైఎస్ జగన్ పరామర్శ యాత్ర చేపడితే జగన్ మొదట షర్మిల ఇంటి నుంచి మొదలు పెట్టాలి అంటూ సెటైర్లు వేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఇక, మంత్రులను తమ కార్యకర్తలు ఎటాక్ చేస్తారని జగన్ అంటున్నారు.. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం బట్టే వారి మెంటల్ స్టెబిలిటీ అర్థం అవుతోందన్నారు.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కచ్చితంగా కేసు నమోదు చేయాలి.. చేస్తాం అన్నారు హోం మంత్రి అనిత..
