Site icon NTV Telugu

Home Minister Vangalapudi Anitha: వైఎస్‌ జగన్ అరెస్ట్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

Anitha

Anitha

Home Minister Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అరెస్ట్‌పై మరోసారి చర్చ సాగుతోంది.. ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడుగా ముందుకు వెళ్తోంది.. కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. షెల్‌ కంపెనీల కథ తేల్చేపనిలో పడిపోయింది.. ఈ సమయంలో.. జగన్‌ను అరెస్ట్‌ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన హోం మంత్రి అనిత.. లిక్కర్ స్కాం కేసులో జగన్ అరెస్ట్ పై స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వ్యాఖ్యానించారు..

Read Also: Bihar Elections: ఈ సాయంత్రం బీహార్ ఓటర్ లిస్ట్ విడుదల.. ఇదే అంశంపై లోక్‌సభలో రగడ

ఇక, గతంలో వైఎస్‌ జగన్ తనకు భద్రత కల్పించటం లేదని చెప్పారు.. ఇప్పుడు తనను అభిమానులు కలవకుండా పోలీసులు చేస్తున్నారని ఆయనే చెబుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అనిత.. కార్యక్రమం కోసం అనుమతి ఇచ్చిన పోలీసులు అందుకు అనుగుణంగా భద్రత కల్పిస్తారని స్పష్టం చేశారు.. అయితే, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పించిన వ్యక్తి జగనేనన్న ఆమె.. అధికారంలో కి వస్తే తప్పు చేసిన అధికారులను వదలమని జగన్ చెబుతున్నది సినిమా డైలాగ్ మాత్రమే సెటైర్లు వేశారు.. ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..

Exit mobile version