Site icon NTV Telugu

Home Minister Anita: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు..

Anitha

Anitha

Home Minister Anita: వడ దెబ్బతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత… తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు.. ఈ సమీక్షలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలి.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. 2025 ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపారు.. 2014, 15, 16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3, 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందన్నారు.

Read Also: Jagdeep Dhankhar: సుప్రీంకోర్టుపై మరోసారి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

ఇక, తాగునీటి అవసరాలపై హోంమంత్రి అనిత ఆరా తీశారు.. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నట్లు సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ వెల్లడించారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళుతున్నట్లు తెలిపారు సీడీఎంఏ డైరెక్టర సంపత్.. రాబోయే రోజుల్లో వడగాల్పులకు గల అవకాశాలపై హోంమంత్రి ఆరా తీయగా.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వ చేసినట్లు తెలిపిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు.. 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.. పాఠశాలల్లో నీటితో పాటు, ఎన్జీవో, విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.. వడగాల్పుల ద్వారా వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు, సిద్ధం చేయడమే కాకుండా వైద్యులకు తగు శిక్షణనిచ్చి అప్రమత్తంగా ఉంచినట్లు పేర్కొన్నారు వైద్యశాఖ అధికారి.. వడదెబ్బ మరణాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత.. ఎండలు, వడగాల్పులపై అవగాహన పెంచాలన్న విపత్తు నిర్వహణ శాఖ మంత్రి.. సచివాలయం, వార్డు సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్.. రాష్ట్రవ్యాప్తంగా 20 నగరాలలో వడగాల్పుల అప్రమత్తత దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.. ఇక, వడాల్పులతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

Exit mobile version