AP Assembly Budget Session: గవర్నర్ ప్రసంగం హైలైట్స్.. మా ప్రభుత్వ లక్ష్యాలు ఇవే..
- ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
- ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..
- గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన కూటమి సర్కార్..
- కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అసెంబ్లీ ముందు పెట్టిన గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అసెంబ్లీ ముందు పెట్టారు.. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభించినప్పట్టి నుంచి సభలో నినాదాలు చేస్తూనే ఉన్నారు వైసీపీ సభ్యులు.. వైసీపీ ప్రతిపక్షంగా గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాసేపు నినాదాలు చేశారు.. ఓ దశలో పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు.. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు వైసీపీ సభ్యులు.. అయితే, గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కార్.. ప్రణాళికలు, లక్ష్యాలను ఓసారి పరిశీలిస్తే..
గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. అయితే, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం.. 200 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశాం.. పెన్షన్లు రూ.4 వేలకు పెంచాం.. మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నాం.. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు.. తమ ప్రభుత్వ నిర్ణయాల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు..
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
* గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగింది..
* అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిది..
* రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళుతున్నాం..
* ఐటీ నుంచి ఏఐ రెవల్యూషన్ దిశగా ఏపీ సాగుతోంది..
* పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు
* ప్రతి నెలా 1నే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నాం..
* బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువస్తున్నాం..
* ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేలా దీపం-2 స్కీమ్‌ను తీసుకొచ్చాం..
* 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నది లక్ష్యం..
* కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతోంది..
* 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం
* స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు..
* ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకునేలోగా 4-5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం..
* ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తాం..
* పేదరికం నిర్మూనలకు వినూత్న విధానంతో ముందుకెళుతున్నాం..
* ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 నినాదాన్ని అనుసరిస్తున్నాం.
* విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి
* స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాం..
* తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నాం.. తల్లి దండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా తల్లికి వందనం..
* తొలిసారిగా స్కిల్ సెన్సెన్స్ నిర్వహిస్తున్నాం.. ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం..
* విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం
* దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ..
* ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేలా ప్రయత్నం
* గత ఐదేళ్లలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు..
* ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరంతో లింక్ చేస్తున్నాం..
* 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం..
* బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు ప్రయోజనం..
* హంద్రీనీవా సుజల స్రవంతి పనులు వేగంగా సాగుతున్నాయి..
* వెలిగొండ ప్రాజెక్టు 75 శాతం పూర్తైంది..
* ఏ రైతుకు సాగునీటి ఇబ్బందులు ఉండకూడదు..
* ఎకరం భూమి కూడా నిరుపయోగంగా ఉండకూడదు..
* వ్యవసాయం రైతులకు మరింత లాభదాయకండా మారేలా చర్యలు..
* భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకున్నాం
* 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లను మంజూరు చేశాం..
* గుంతలులేని రోడ్ల నిర్మాణంలో అద్భుతమైన పురోగతి..
* 20,059 కి.మీ.కి గాను 3 నెలల్లోనే 27,605 కి.మీ. రోడ్ల పని పూర్తి చేశాం..
* 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యం..
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిపై ఫోకస్
* 2025-26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉండదు..
* 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు..
* రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్
* దేశంలో ఆక్వారంగంలో ఏపీకి తిరుగులేదు..
* నిజాంపట్నంలో రూ.88.08 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్..
* ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం..
* ధాన్యం సేకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతోంది..
* ఏపీని అత్యుత్తమ లాజిస్టిక్ కలిగిన రాష్ట్రంగా మారుస్తాం
* 10 పోర్టులను ప్రపంచస్థాయి పోర్టులుగా తీర్చిదిద్దుతున్నాం..
* 2029 నాటికి వైజాగ్‌లో 46.23 కి.మీ. మెట్రో రైల్ నెట్వర్క్..
* 38.40 కిమీ నెట్‌వర్క్‌తో విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం..
* మేడిన్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హాల్‌మార్క్‌గా మారేలా కృషి..
* రైతులకు కనీస మద్దతుధరను స్థిరపరిచేలా ప్రణాళిక..
* మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా టమాటా, మిర్చి రైతులకు మద్దతు ధర..
* 15,948 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించాం..
* 70 శాతం గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ అమలు చేస్తున్నాం..
* 7,559 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి
* దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది..
* 161 సేవలను అందిస్తూ మన మిత్రను ప్రారంభించాం..
* నేరాల పట్ల ఏ మాత్రం ఉపేక్షం వహించం..
* 20 వేల సీసీటీవీ కెమెరాలతో క్లౌడ్ ఆధారిత ఐపీ సీసీటీవీ నిఘా వ్యవస్థ..
* ప్రతి జిల్లాలో ఓ సైబర్ పోలీస్ స్టేషన్
* డ్రగ్స్, గంజాయి రవాణా, మహిళలపై నేరాల నియంత్రణకు కఠిన చర్యలు..
* మార్కెట్ ఆధారిత విధానంతో కొత్త ఎక్సైజ్ విధానం..
* నాణ్యమైన బ్రాండ్లను తిరిగి ప్రవేశపెట్టాం.. బీర్ల ధరలు తగ్గించాం
తాజావార్తలు
-
Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
-
Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్‌కి
-
Hero Vida VX2 GO FB: 128 KM రేంజ్‌తో విడా VX2 GO FB కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే
-
PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
-
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!