AP High Court: సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.. ఇలాంటి పోస్టులు నిరోధించని పక్షంలో వాటిని ప్రత్యర్ధులపై కక్ష సాధింపు కోసం వినియోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.. వ్యక్తులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి చట్టం అనుమతి ఇస్తుంది.. కానీ, ఆ స్వేచ్చను వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీయటానికి వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఏపీ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.. కాగా, పలు సందర్భాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. ఇలా ఎవ్వరినీ వదలకుండా.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్న విషయం విదితమే..
AP High Court: సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వానికి ఆదేశాలు
- సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- నిరోధానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరాలు ఇవ్వండి..
- ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు..

Ap High Court