AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో 27,400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. 27 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.. రూల్ 24 (3) కింద ప్రతి ఏడాది రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, 2018 తర్వాత ఇప్పటి వరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదని హైకోర్టులో గోడు విన్నవించుకున్నారు పిటిషనర్.. ఈ విషయంలో పొలిటికల్ గా కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కూటమి సర్కార్‌ను ఆదేశించింది.
Read Also: Congress: పెను మార్పుల దిశగా కాంగ్రెస్.. ఇక డీసీసీలకు ఫుల్ పవర్స్..