NTV Telugu Site icon

AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Ap High Court

Ap High Court

AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. అక్రమ నిర్మాణాలు చేపట్టే సమయంలో ఉన్న రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పేర్లు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు.. అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది.. అక్రమ నిర్మాణాలపై గతంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసింది హైకోర్టు.. అంతేకాదు, గతంలో అక్రమ నిర్మాణాలను ఆ కమిటీ పరిశీలించింది.. నివేదికను హైకోర్టుకు అందించింది.. మరోవైపు, ప్రస్తుతం భీమిలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న ఫోటోలను హైకోర్టు ముందించారు పిటిషనర్ పీతల మూర్తి యాదవ్.. అయితే, అక్రమ నిర్మాణాల ఫొటోలు చూసి విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. వెంటనే అక్రమ కట్టడాలను తొలగింపును పరిశీలించాలని ఎక్స్‌పర్ట్‌ కమిటీకి మరోసారి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నేహా రెడ్డి సహా మరో 5 రిస్టో బార్ అక్రమ నిర్మాణాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ప్రధాన పిటిషన్‌లో అన్నింటిని పొందుపరచాలని పిటిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది..

Read Also: Sonia Gandhi: గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు