Site icon NTV Telugu

AP High Court: సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు షాక్..

Psr Anjaneyulu

Psr Anjaneyulu

AP High Court: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు షాక్‌ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పీఎస్సార్ ఆంజనేయులు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)లో అవకతవకల కేసులో పీఎస్సార్, ధాత్రి మధు.. దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు ధాత్రి మధు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, అనారోగ్య కారణాలు ఉంటే.. రెండు వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పీఎస్సార్ ఆంజనేయులుకు సూచించింది ఏపీ హైకోర్టు..

Read Also: Somireddy Chandramohan Reddy: జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడు..

కాగా, ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు ఇప్పటికే బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే.. ఈ కేసులో పీఎస్సార్‌ ఆంజనేయులుకు 36 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు.. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి, ముగిసిన పోలీసు కస్టడీ, కేసులో పిటిషనర్‌ పాత్ర తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీఎస్సార్‌ ఆంజనేయులుకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.. అయితే, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు ఇప్పటికే హైకోర్టు బెయిల్‌ తిరస్కరించగా.. ఈ రోజు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది..

Exit mobile version