NTV Telugu Site icon

Holiday For Schools: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన

Heavy Rains

Heavy Rains

Holiday For Schools: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది..

Read Also: Hyderabad Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

అయితే, భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. జిల్లాలోని స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించింది.. వర్షాల నేపథ్యంలో పలు పరీక్షలను కూడా వాయిదా వేశారు.. మరోవైపు.. భారీవర్షాల కారణంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది జిల్లా విద్యాశాఖ… ఇక, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. అల్లూరి, అనకాపల్లి జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు.. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సృజన.. ఇక, వాయుగుండం ప్రభావంతో రిషికొండ బీచ్ లో పర్యాటకంపై ఆంక్షలు విధించారు విశాఖ అధికారులు.. సముద్ర విహారానికి వెళ్లే బోట్లను నిలిపివేశారు.