NTV Telugu Site icon

AP Maritime Policy 2024-29: 2024-29 ఏపీ మారిటైమ్ పాలసీ విడుదల.. అసలు టార్గెట్‌ అదే..

Ap Maritime Policy

Ap Maritime Policy

AP Maritime Policy 2024-29: 2024-29 ఏపీ మారిటైమ్ పాలసీని విడుదల చేసింది ప్రభుత్వం.. మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్.. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన విధానం రూపొందించింది ప్రభుత్వం.. ఏపీ మారిటైమ్ విజన్ ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానం తయారు చేసింది ప్రభుత్వం. సుదీర్ఘమైన తీరప్రాంతం, వ్యూహాత్మకంగా అనువైన ప్రాంతాన్ని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించేలా విధాన రూపకల్పన చేశారు.. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించారు.. ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించేలా విధానాన్ని తయారు చేసింది సర్కార్‌.

Read Also: Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం..

కార్గో హ్యాండ్లింగ్ సామర్ధ్యాలను పెంపోందించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. పోర్టుల పరిధిలోని ప్రాంతాలను పారిశ్రామిక, లాజిస్టిక్ క్లస్టర్లుగా అభివృద్ధి చేయటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా కొత్త విధానం తయారు చేశారు.. షిప్యార్డు షిప్ బిల్డింగ్ మరమ్మత్తులు చేపట్టేలా కార్యాచరణ.. దీంతో పాటు అనుబంధ మారిటైమ్ సేవలు అందించేలా కొత్త విధానం ఉంది.. ప్రపంచంలోని 20 భారీ పొర్టుల్లో ఒకటి ఏపీలో ఉండే విధంగా సామర్ధ్యం పెంపు లక్ష్యంగా కొత్త మారిటైమ్ పాలసీ తీసుకొచ్చారు.. 2047 నాటికి దేశంలోని పోర్టుల్లో నిర్వహిస్తున్న మొత్తం కార్గోలో 20 శాతం ఏపీలోనే నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.. నౌకల టర్న్ అరౌండ్ సమయాన్ని 15 గంటల కంటే తక్కువకు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.. పోర్టు సంబంధిత వ్యవహారాల్లో 5 వేల మంది నిపుణులను 2028 నాటికల్లా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఇక, మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్..

Show comments