Excise Policy: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..!
- ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు..
- వ్యాపారులకు ఊరట నిచ్చేలా బార్లపై అదనపు పన్ను రద్దు..
- బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు..
- ఇకపై వైన్స్‌లు.. బార్లలో.. ఎక్కడ లిక్కర్ కొనుగోలు చేసిన ఒక్కటే రేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కొనుగోలు చేసే వారికి, అలాగే బార్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు చేస్తూ, బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై వైన్స్ అయినా.. బార్ అయినా.. ఎక్కడ లిక్కర్ కొనుగోలు చేసినా ఒకే రేటు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బార్ వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు ఒకే మద్యానికి రిటైల్ షాపుల్లో ఒక ధర, బార్లలో మరో ధర ఉండేది. తాజా మార్పులతో ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ధరల తేడా ఉండదు.
Also Read
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
అయితే, లిక్కర్ ధరల్లో సమానత్వం తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్‌ఎల్‌పై ఇకపై అదనపు పన్ను విధించరాదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల అమలుకు డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, ఏపీఎస్‌బీసీఎల్ అధికారులు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఎక్సైజ్ పాలసీ మార్పులు రాష్ట్రంలో మద్యం ధరల వ్యవస్థలో కీలక మలుపుగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!