NTV Telugu Site icon

Gone Prakash Rao: సీఎం చంద్రబాబుతో గోనె ప్రకాష్‌ భేటీ.. మాజీ సీఎంలపై హాట్‌ కామెంట్స్..

Gone Prakash Rao

Gone Prakash Rao

Gone Prakash Rao: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాష్‌ రావు.. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై హాట్‌ కామెంట్లు చేశారు.. చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాదర్భార్‌లు నిర్వహించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజలకు మంచి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ఇక, గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని కామెంట్‌ చేశారు.. బంధువులే తనకు తెలీదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన జగన్ దుర్మార్గుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

Read Also: CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..

మరోవైపు.. తెలంగాణలో ప్రైవేటు భూమి అయినా కొనుగోలు చేసి ఏపీ మంచి అతిథి గృహం నిర్మించాలని సూచించారు గోనె ప్రకాష్‌.. జన్మభూమి లాంటి కార్యక్రమాలు చంద్రబాబు చేపడితే విదేశీ విరాళాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్న ఆయన.. ఏపీలో 36 మందిని హత్య చేసినట్టుగా చెబుతున్న వైఎస్‌ జగన్.. వాటి వివరాలు బహిర్గతం చేయాలి అని డిమాండ్‌ చేశారు.. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ జగన్ లా పరదాలు కట్టుకుని పర్యటించలేదని ఎద్దేవా చేశారు.. రాష్ట్రపతి పాలన అంటూ డిమాండ్ చేసిన జగన్ కు సిగ్గు ఉందా..? అంటూ ఫైర్‌ అయ్యారు.. ప్రజల నుంచి పూర్తి మెజార్టీ వచ్చాక రాష్ట్రపతి పాలన ఎలా అనుమతిస్తారు..? అని ప్రశ్నించారు గోనె ప్రకాష్‌రావు..

Show comments