NTV Telugu Site icon

Supreme Court: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట

Sc

Sc

Supreme Court: దేవినేని అవినాష్, జోగి రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌లకు ఊరట కల్పించింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్.. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది.. మరోవైపు.. ఈ కేసు విచారణకు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహకరించాలని పేర్కొంది.. ఇదే సమయంలో దేవినేని అవినాష్, జోగి రమేష్ తమ పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్‌ చేయాలని స్పష్టం చేసింది.. అయితే, వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్.. ఇక, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు..

Read Also: Devara-Hollywood: హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘దేవర’.. వీక్షించనున్న ప్రముఖ నటులు!

కాగా, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌కు కాస్త ఊరట దక్కినా.. పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్‌ చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్‌, జోగి రమేష్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.. మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీం.. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని సూచించింది.. నలుగురు విచారణకు పూర్తిగా సహకరించాలని పేర్కొంది.. ఇక, కేసు తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.. ముందస్తు బెయిల్‌పై నవంబర్ 4న తేల్చనుంది సుప్రీంకోర్టు.. కానీ, అప్పటి వరకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది..