Weather Update: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. నాలుగు రోజులు వర్షాలే వర్షాలు..!
- నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..
- గంటకు 12 కిమీ వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలో మీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనన తీవ్ర వాయుగుండం.. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది.. ఆ తదుపరి 2 రోజులలో శ్రీలంక తీరం దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుండి 29వ తేదీ వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూంచింది.. ఇక, నవంబర్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు..
Read Also: Minister Komatireddy: జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్
Also Read
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో మెగాస్టార్ సందడి..
-
Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
-
KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
-
Finn Allen: ఇది ‘ఫిన్ అలెన్ 2.0’.. 40 బంతులు నా టార్గెట్.. కేకేఆర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?