AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక చర్చలు జరగనున్నాయి.. దాంతో, పలు సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ జరగనుండగా.. వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక, ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, రాష్ట్రంలో గ్రంథాలయాలపై చర్చ జరగనుండగా.. మరోవైపు, జీఎస్టీ సంస్కరణలపై మండలిలో ప్రకటన చేయనున్నారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రులు. అయితే, మండలిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి మూడవ రోజు శాసనమండలి సమావేశాలు…
అసెంబ్లీలో ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు..
* 20 లక్షల ఉద్యోగాల కల్పన..
* ఎన్ఆర్ఈజేఏ సాఫ్ట్ సమచారాన్ని పొందుపరుచుటలో తప్పులు..
* వైఎస్ఆర్ కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకం..
* దీపం 2 పథకం..
* సిమెంట్ ధరలలో వ్యత్యాసం..
* నకిలీ ఎరువుల విక్రయం..
* ప్రైవేట్ వైద్య పరీక్షా కేంద్రాలు…
* కభేళాలు..
* నాగావళి నది మీదుగా పూర్ణపాడు – లాభేసు వంతెన..
* నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయం..
సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు..
* ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ వార్షిక నివేదిక..
* ఏపీ అల్ప సంఖ్యాక వర్గాల ఆర్ధిక సంస్థ వార్షిక నివేదిక..
* ఏపీ అత్యవసర నిర్వహణ చట్టం నోటిఫికేషన్..
* ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ వార్షిక నివేదిక..
* అబ్కారీ నియమాలు..
* కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల నోటిఫికేషన్…
* ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వార్షిక నివేదిక..
* అనంతరం జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ..
