Site icon NTV Telugu

Ram Gopal Varma: నాకు ముందస్తు బెయిల్‌ ఇవ్వండి.. హైకోర్టుకు ఆర్జీవీ

Rgv

Rgv

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం విదితమే కాగా.. అయితే, ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. వర్మ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చటంతో.. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. మరోవైపు, పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు.. ఇక, ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారని.. కొంత సమయం ఇవ్వాలని కోరిన విషయం విదిమే.. మొత్తంగా పోలీస్ విచారణకు హాజరుకాని వర్మ.. ఇప్పుడు ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఇక, వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడ ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది..

Read Also: Daaku Maharaj : డాకు మహారాజ్ పై సాలిడ్ అప్ డేట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే ?

Exit mobile version