Site icon NTV Telugu

Mark Shankar: పవన్‌ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్‌, రోజా..

Pawan Kalyan

Pawan Kalyan

Mark Shankar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. సింగపూర్‌లోని రివర్‌వాలీ ప్రాంతంలో వున్న టొమోటో కుకింగ్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌.. చిన్న పిల్లలకు వంటల పాఠాలు చెప్పే స్కూల్‌గా పాపులర్ అయ్యింది టొమోటో‌ కుకింగ్ స్కూల్.. అయితే, ఉదయం ఈ స్కూల్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.. అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌తో పాటు మరో 14 మంది చిన్నారులు, నలుగురు పెద్దవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

Read Also: Uttar Pradesh: ఇదేం “రీల్స్” పిచ్చి.. ప్రయాణిస్తున్న రైలు కింద పడుకుని వీడియో..

ఇక, మన్యం పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తన పర్యటనను కుదించుకుని.. హుటాహుటిన సింగపూర్‌ బయల్దేరి వెళ్లిపోయారు.. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.. ఈ ప్రమాదంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన వైఎస్‌ జగన్‌.. సింగపూర్‌ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. క్లిష్ట సమయంలో భగవంతుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకున్నారు.. మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.. ఇక, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు..

Read Also: Sheikh Hasina: త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా.. అందుకే ఆ అల్లా నన్ను బతికించాడు..

సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని ట్వీట్‌ చేశారు.. ట్విట్టర్‌లో స్పందించారు మంత్రి నారా లోకేష్‌.. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. ఈ ప్రమాదంలో పవన్‌ కల్యాణ్‌ అన్నా కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బలం చేకూర్చాలని పార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ జనసేన అధినేత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కుకున్నారు జనసేన నాయకులు.. పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి గాయాలపై ఎక్స్‌ (ట్విట్టర్‌)లో స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్‌.. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను.. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు..

Exit mobile version