అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ నోట మళ్ళీ క్షమాపణలు అనే పదం వచ్చింది. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని తెలిపారు. ఎన్డీఏ సభ్యులు 164 మంది చాలా బాధ్యతతో ఉన్నారు.. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. గొడవలకు, బూతులకు వైసీపీ పర్యాయ పదం అని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఇంత కాలం వారిని తట్టుకుని నిలబడినందుకు సీఎం చంద్రబాబుకు ఎన్నో గట్స్ ఉన్నాయి.. నిన్న నాకు వైసీపీ వైఖరి చూసి వివేకా హత్య, ప్రజావేదిక కూల్చివేత, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జీలపై పెట్టిన కామెంట్లు.. దాడులు గుర్తొచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. చంద్రబాబును జైల్లో పెట్టిన విధానం గుర్తొచ్చిందని పేర్కొన్నారు.
Read Also: L2E EMPURAAN: ‘L2E ఎంపురాన్’లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ జెరోమ్ ఫ్లిన్.. అదిరిందిగా!
రాజధాని నిర్మించుకోలేని పరిస్థితిలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది.. సామాజిక ఆర్ధిక అభివృద్ధి సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఆర్ధిక సుస్థిరత లేదని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతో పాటు స్కిల్ గణన కూడా జరగాలని కోరుకున్నాం.. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు కూడా జరిగిందని అన్నారు. మరోవైపు.. సామాన్యులకు వైద్య ఖర్చులు భారం కాకూడదు అని రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళాం.. ఆంధ్రప్రదేశ్‌లో కులాల ప్రస్తావన తప్పా, ఆంధ్రులు అనే భావన లేదని పవన్ వెల్లడించారు. ఒక్క విశాఖ ఉక్కు విషయంలోనే ఆంధ్రులు అనే భావన వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ఇంగ్లీషు, హిందీలో ప్రధాని మోడీకి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: KTR: కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది..
అసెంబ్లీలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార ప్రతిపక్ష పాత్ర తామే పోషిస్తామని తెలిపారు. టీటీడీ తొక్కిసలాట విషయంలో తాను క్షమాపణ చెప్పానన్నారు. కూటమి సభ్యుల్లో విభేదాలు ఉండచ్చు.. అందరూ కలిస్తేనే అభివృద్ధి అని పేర్కొన్నారు. మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసి బలంగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.