NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన పవన్‌.. కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే.. ఆ స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందన్నారు.. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Public opinion: రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది? ప్రతిపక్ష నేతగా వంద రోజులు పూర్తైన సందర్భంగా ప్రజాభిప్రాయం

ఇక, గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామివారికి చేసే కైంకర్యాలు కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు.. అన్నింటిలోనూ నాణ్యత ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు పవన్‌ కల్యాణ్‌.. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్లు చేసిన నిర్ణయాలు, వారి పాలన తీరును – సమగ్రంగా సమీక్షించి, సంస్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.. తప్పుడు నిర్ణయాలకు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తామంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..