Cyclone Montha: మొంథా తుఫాన్ క్రమంగా తీవ్ర రూపం దాల్చుతూ తీరం వైపు దూసుకొస్తుంది.. పెను తుఫాన్‌గా మారిపోయింది మొంథా తుఫాన్.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మొంథా పెను తుఫాన్‌గా మారిపో్యింది.. గత 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది.. తుఫాన్ ప్రస్తుతం.. మచిలీపట్నంకి దక్షిణ–ఆగ్నేయంగా 160 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకి దక్షిణ–ఆగ్నేయంగా 240 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 320 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైంది.. ఇక, గోపాల్‌పూర్ (ఒడిశా) కి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మొంథా పెను తుఫాన్.. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొంథా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.. తీర దాటే సమయానికి గాలివేగం గంటకు 90–100 కిలో మీటర్ల నుంచి గరిష్టంగా 110 కిలో మీటర్ల వరకు వీస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు..
Read Also: Sandhya Mridul: ఫాలోవర్స్ లేని నటీనటులకి ఇండస్ట్రీలో పనిలేదు..
ఇక, ఇప్పటికే విశాఖపట్నం సహా తీర ప్రాంతంలోని జిల్లాలపై మొంథా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. మరోవైపు కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు..
