Site icon NTV Telugu

AP Capital Project: అమరావతి రాజధాని కోసం నిధుల సమీకరించుకునే పనిలో సీఆర్డీఏ

Crda

Crda

AP Capital Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం నిధులు సమీకరించుకునే పనిలో సీఆర్డీఏ పడింది. ఏడీబీతో కుదుర్చుకున్న రుణ ఒప్పందం మేరకు వచ్చే నాలుగేళ్లలో అమరావతి రాజధాని నగరంలో భూ విక్రయానికి ప్రణాళిక రచిస్తుంది. రాబోయే నాలుగేళ్లలో మొత్తం 2500 కోట్ల రూపాయల మేర భూమి విక్రయించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక, అధిక ధర ఉన్న భూములకు సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ దృష్టి పెట్టింది.

Read Also: iPhone 17: ఐఫోన్ లవర్స్ డబ్బులు రెడీ చేసేసుకోండి.. అతి త్వరలో iPhone 17 విడుదల.. ధర, ఫీచర్స్ ఇలా!

అయితే, వచ్చే ఏడాదిలో దాదాపు 370 కోట్ల రూపాయల విలువైన భూమి తొలి దశలో అమ్మకం చేసేలా సీఆర్డీఏ ప్రణాళికలు రచిస్తుంది. రాబోయే రెండు మూడేళ్ళలో రాజధానికి నిధులు వచ్చేలా ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంది.

Exit mobile version