Site icon NTV Telugu

CPI Narayana: తేడా ఏమీ లేదు..! జగన్ హోల్ సేల్‌గా చేస్తే.. చంద్రబాబు రిటైల్‌గా చేస్తున్నాడు..

Narayana

Narayana

CPI Narayana: జగన్ హోల్ సేల్‌గా చేస్తే.. చంద్రబాబు రిటైల్‌గా చేస్తున్నాడు.. పెద్ద తేడా ఏమీ లేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ప్రస్తుతం రాజకీయాల్లో నీచమైన భాష నడుస్తోంది.. పోలీసు అధికారులను జగన్ తిట్టారు.. మీరు అధికారంలో వున్నప్పుడు ఏం చేశారు..? అని ప్రశ్నించారు.. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసు లేకుండా అరెస్ట్ చేశారు… ఎంపీని ఇబ్బంది పెట్టారు.. అవన్నీ ఇప్పుడు మరిచిపోతే ఎలా..? అని జగన్‌ను నిలదీశారు.. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు IAS, IPSలు తలొగుతున్నందునే ప్రభుత్వాలు మారిన వెంటనే పనిష్మెంట్లకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు నారాయణ..

Read Also: Prashant Kishor: ఈసారి నితీష్‌కుమార్‌కు జరిగేది ఇదే.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

ఇక, చంబల్ వ్యాలీ కంటే అమిత్ షా పెద్ద డెకాయిట్‌గా మారాడు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు నారాయణ.. అధికార పూర్వకంగా ప్రభుత్వమే హంతకుడిగా మారింది.. సిద్ధాంతం చంపడం సాధ్యం కాక.. శారీరకంగా తొలగించడం అనే విధానం కొనసాగుతోంది.. పోటీపడి జాతీయ నాయకులకు దండలు వేసే వాళ్లకు నార్కో టెస్ట్ చేస్తే అంతర్గత ఆలోచనలు బయటకు వస్తాయన్నారు.. “బై హుక్ ఆర్ కుక్” అధికారంలో కొనసాగాలనే ఆలోచన ధోరణి కారణంగానే రాజకీయాలు దిగజారుతున్నాయి అని వ్యాఖ్యానించారు.. వక్ఫ్ బిల్లు ప్రమాదకరమైందని అభిప్రాయపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Exit mobile version