NTV Telugu Site icon

CM Chandrababu: అమరావతికి అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా.. నేడు జీఐఎస్‌ను ప్రారంభించనున్న సీఎం

Cbn

Cbn

CM Chandrababu: కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్‌నిర్మాణంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిర్మాణాలను కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, నిపుణులను కూడా రంగంలోకి దింపడం.. వాళ్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం.. ఆ తర్వాత పనులు పునర్‌ ప్రారంభం అన్ని జరిగిపోయాయి.. ఇక, అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. దీనికోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ఈ రోజు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: IT Raids: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు.. అర్ధరాత్రి వరకు సోదాలు..

రాష్ట్రంలో తొలిసారిగా తాళ్లాయపాలెంలో ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా 220/440 కేవీ ఏర్పాటు చేశారు.. ఇప్పటి వరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతుండగా.. తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220 కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220 కేవీగా అప్‌గ్రేడ్‌ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు.. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు.. మొత్తంగా అంతరాయం లేకుండా రాజధాని అమరావతికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం..

Read Also: Telangana Temperature: తెలంగాణను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

అయితే, ఈ రోజు మొత్తంగా ఐదు సబ్‌స్టేషన్ల ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో మరో 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ సబ్‌స్టేషన్లు ప్రధానంగా పరిశ్రమలు, ఆక్వాకల్చర్ మరియు వ్యవసాయ రంగాలు మరియు గృహాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించగలవని అధికారి చెబుతున్నారు.. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) భౌతికంగా ప్రారంభించనున్న సీఎం.. మరో నాలుగు సబ్‌స్టేషన్‌లను ప్రారంభించి, మరో 14 వాటికి శంకుస్థాపన చేస్తారు.