NTV Telugu Site icon

CM Chandrababu: చరిత్ర తిరిగి రాయడానికి సిద్ధమయ్యం.. జెట్ స్పీడ్‌తో పనులు..

Babu

Babu

CM Chandrababu: ఒక చరిత్ర తిరిగి రాయడానికి మనం సిద్ధమయ్యం.. ఎంతమంది రాక్షస మూకలు వచ్చినా ఈ అమరావతిని బ్రతికించిన ఘనత ఇక్కడి రైతాంగానిదే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.. 160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. గడిచిన ప్రభుత్వం అమరావతి రైతాంగాన్ని బాధపెట్టారు.. రైతు మహిళలు వీరోచితంగా పోరాడారు ఇక్కడ.. అడుగడుగునా అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు.. బాత్ రూమ్‌లపై కూడా డ్రోన్లు వేసి పైశాచిక ఆనందం ప్రదర్శించారని మండిపడ్డారు..

Read Also: Disrespect Indian Flags: భారత జాతీయ జెండాలను, మోడీ దిష్టిబొమ్మను చింపేసిన ఖలిస్థాన్ ఉగ్రవాదులు

16 శాతం లోటు బడ్జెట్ తో ఆ రోజు పాలన ప్రారంభించాం అన్నారు సీఎం చంద్రబాబు.. సైబరాబాద్ ఆనాడు ప్రభుత్వ భూములలో నిర్మించినది.. 8 వరసల‌‌ రోడ్డును సైబరాబాద్ వద్ద మంచి రోడ్డు రూపకల్పన చేసాం అప్పట్లో… ఏం చేసినా విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్ధితులు.. సెంటిమెంట్ లు ఎన్నున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం భూము ఇచ్చారు.. 54 వేల‌ ఎకరాలు అమరావతి కోసం సేకరించాం.. ఎంతమంది రాక్షస మూకలు వచ్చిన ఈ అమరావతిని బ్రతికించిన ఘనత ఇక్కడి రైతాంగానిదే అన్నారు.. కొంత రాజీ పడి పనులు పునః ప్రారంభించాం.. నాలుగు నెలల్లోనే పని పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ హామీ ఇచ్చారు.. అమరావతికి ఒకవైపు 12, మరోవైపు 12 పార్లమెంటు నియోకవర్గాలు ఉంటాయి అన్నారు.. విశాఖను ఆర్ధిక రాజధానిని చేస్తాం… కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టి అభివృద్ధి చేస్తాం.. జరీబు భూములకు 50 వేలుతో మొదలెట్టి 10 శాతం పెంచుతాం అని చెప్పాం… త్వరలోనే 225 కోట్లు జరీబు భూములకు నిధులు విడుదల చేస్తాం.. జరీబు కాని భూములకు కూడా త్వరలో నిధులు విడుదల చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: Satyendar Jain: జైలు నుంచి బయటకు వచ్చి జైన దేవాలయం దర్శించిన జైన్‌ దంపతులు

నేను హైదరాబాదులో డబ్బులు ఖర్చు పెట్టలేదు.. సంపద సృష్టించాను.. 30 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పాను.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, ఉపాధికి ఒక కేంద్రం.. అన్నారు చంద్రబాబు.. ఏకంగా ఒకాయన ఎడారి అంటాడు.. స్మశానం అంటాడు.. హైదరాబాద్‌లో ఆయన కట్టుకున్న కొంప దగ్గరే నీళ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఎవరూ చెడిపోవాలని కోరుకోకూడదు.. ప్రజలు అమరావతి పేరును నూటికి నూరు శాతం ఆమోదించారు.. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్టు తో సుందర నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం.. 131 ప్రైవేటు సంస్ధలకు 1257 ఎకరాలు ఇచ్చాం అని గుర్తుచేసుకున్నారు.. 1631 రోజులు ఇక్కడి రైతులు ఉద్యమించారు… XLRI, లా యీనివర్సిటీ, బిట్స్ పిలానీ కూడా ఇక్కడకి వస్తాయి… 10 టాప్ బెస్ట్ స్కూల్స్, 10 టాప్ బెస్ట్ కంపెనీలు ఇక్కడికి రావాలి.. అమరావతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ లు తేవాలని చెప్పాం అన్నారు.. 52వేల‌ కోట్ల రూపాయలు వస్తున్నాయి.. కేంద్రం చేస్తున్న సహకారానికి అభినందిస్తున్నామన్న బాబు.. ముఖ్యమైన టవర్లు, బిల్డింగ్ లు ప్రారంభిస్తాం.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ మీన మేషాలు లెక్కేయద్దు.. జెట్ స్పీడుతో పనులు జరగాలని ఆదేశించారు.. త్వరలో మొత్తం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగంలోకి తేవాలని చూస్తున్నా.. మూడు సంవత్సరాల లో పూర్తవ్వాలి.. ఆ తరువాత ఒక్క క్షణం కూడా ఎదురు చూడను. దేశంలో ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలని నేను చూస్తున్నా అన్నారు..

Read Also: Amaravati Capital Works: రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం శ్రీకారం

కష్టాలు ఉన్నాయని నేను పారిపోను అన్నారు చంద్రబాబు.. పోలవరానికి 12150 కోట్లు ఫేజ్ వన్ లో కేంద్రం ఇస్తోంది.. త్వరలో పోలవరం పనులు మొదలవుతాయన్న ఆయన.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాం.. వంద సంవత్సరాల స్వతంత్ర దేశ ఉత్సవాల నాటికి మనం ప్రపంచంలోనే ప్రథమ స్ధానంలో ఉంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. ప్రపంచమే హద్దుగా మనం పని చేయాలి… 2024 ఎన్నికల ఫలితాలు గుర్తుంచుకోవాల్సినవి.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి.. ఒక భూతాన్ని శాశ్వత భూస్ధాపితం చేయాలి.. చెడ్డ పేరు తెచ్చే ఎమ్మెల్యేలను వదిలేసుకుంటా.. రాష్ట్ర అభివృద్ధికి ట్రస్టీగా ఉంటాను అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments